3.ఆధునిక సాహిత్యం లో - ఉద్యమాలు ధోరణులు - సాహిత్య ప్రక్రియలు.

తెలుగు సాహిత్యంలో భాషాశాస్త్రం,తెలుగు సాహిత్య చరిత్ర గురించి ప్రామాణిక పుస్తకాలు ఏవో ఇంతక ముందు తెలుసుకొన్నాము.ప్రాజ్ఞన్నయ యుగం నుండి నన్నయ వరకు సాహిత్యం ఒక ఎత్తు అయితే నన్నయ యుగం నుండి దక్షినాంధ్ర యుగం వరకు వచ్చిన సాహిత్యం ఇంకొక ఎత్తు .ఆ తర్వాత మొదలైన ఆధునిక సాహిత్యం, సాహిత్యం అంటే ఇలానే ఉండాలి అనే ఎల్లలను చెరిపేసింది అనడం లో ఎలాంటి సందేహం లేదు.పాశ్చత్య దేశాలు ప్రభావం చేత తెలుగు సాహిత్యం లో కూడా కవితా ఉద్యమాలు మొదలు అయ్యాయి. సంఘ సంస్కరణోద్యమం నుండి చూసినట్లయితే మైనారిటీ కవిత్వం వరకు ఎన్నో సాహిత్య ఉద్యమాలు తమ ఉనికిని చాటుకోన్నాయి.సమాజాన్ని ప్రభావితం చేసిన చాలా వరకు సాహిత్యం వీటి ద్వారానే వచ్చింది అని చెప్ప వచ్చును. ఈ కవితోద్యమాలకి సంబంధించిన ప్రామాణిక పుస్తకాలు. · తెలుగు లో కవితోద్యమాలు ...