2.తెలుగు సాహిత్య చరిత్ర
మనం ఇంతక ముందు భాషా శాస్త్రం కి సంబంధించిన ప్రామాణిక పుస్తకాలు గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు సాహిత్య చరిత్ర గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు తెలుగు పోటి పరీక్షలు విషయానికొస్తే D.S.C మొదలకొని ASSISTANT PROFESSOR వరకు ప్రతీ దశలో మనం సాహిత్య చరిత్ర చదవాల్సిందే,కానీ చాలా మంది అభ్యర్థులు మెటీరియల్ చదవడానికి ఇష్టపడుతుంటారు .అది వారికి సులభం అయినప్పటికీ రిస్క్ తీసుకోవడమే, అలా మెటీరియల్ చదివి మా వాడు జాబు సంపాదించాడు అంటే దానికి ఇక్కడ సమాధానం లేదు .
ముఖ్యంగా టీచింగ్ గోల్ ఉన్నవారు జే.ఎల్. ,డి .ఎల్ కి సన్నద్దం అయ్యే వారు టైం చూసుకొని కోర్ సబ్జెక్టు చదవడం వలన రిస్క్ తగ్గించుకోవచ్చు.ఇంకా ప్రామాణిక పుస్తకాలు విషయానికొస్తే ఇవి చదవడమే కాకుండా మీరు ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదవడం ఎంతో మంచిది .సివిల్స్ తెలుగులో రాయాలి అనుకొనే వారికి కూడా ఈ పుస్తకాలు ఉపయోగపడతాయి విజయ లక్ష్యం చేరువ కావడానికి హార్డ్ వర్క్ ఎంత ముఖ్యమో స్మార్ట్ వర్క్ కూడా అంతే ముఖ్యం కాలం మారింది పరీక్ష విధానాలు కూడా మారుతున్నాయి.మీకు అన్ని పుస్తకాలు చదవడానికి వీలు పడకపోతే కొన్ని పుస్తకాలు అయినా చదివిన తర్వాత మీకు అందులో ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నపుడు గానీ అసంపూర్ణం అనిపించినపుడు ఇంకా లోతైన విశ్లేషణ కావాలి అనుకున్నపుడు మిగతా వాటిని కూడా చదవండి .
తెలుగు సాహిత్య చరిత్ర ప్రామాణిక పుస్తకాలు .
- తెలుగు సాహిత్య చరిత్ర - కొర్లపాటి శ్రీ రామమూర్తి (5 సంపుటాలు ఇప్పుడు దొరకడం లేదు )
- తెలుగు సాహిత్య సమీక్ష - జి.నాగయ్య (2 సంపుటాలు )
- తెలుగు సాహిత్య చరిత్ర - డా || ద్వానా శాస్త్రి
- తెలుగు సాహిత్య చరిత్ర - ఆచార్య వెలమల సిమ్మన్న
"WORK HARD IN SILENCE,LET YOUR SUCCESS BE YOUR NOISE"
Comments
Post a Comment